Header Banner

రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. e-KYC ప్రక్రియకు గడువు పొడిగింపు - ఇది చేసిన వారికే.! కేంద్రం కీలక నిర్ణయం..

  Sun Apr 06, 2025 10:59        Politics

మన దేశంలో పేదలు ఎక్కువ. వారికి రోజు వారీ సంపాదన చాలా తక్కువ. వారు ఆర్థికంగా నిలదొక్కుకొని పైకి రావడం అంత తేలిక కాదు. అందుకే పేదల్ని ఆదుకునేందుకు కేంద్రం రేషన్ ద్వారా ప్రతి నెలా బియ్యం లేదా గోధుమల్ని లబ్దిదారులకు ఇస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా బియ్యంతోపాటూ.. పంచదార, కందిపప్పు వంటివి కూడా ఇస్తున్నాయి. ఈ రేషన్ వ్యవస్థ సక్రమంగా ఉండేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేంద్రం, రేషన్ కార్డు దారులంతా తప్పనిసరిగా e-KYC ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పింది. దానికి గడువు మార్చి 31 వరకే ఉండేది. తాజాగా కేంద్రం ఈ గడువును ఏప్రిల్ 30 వరకూ పొడిగించింది. అందువల్ల ప్రజలు.. ఇదివరకు e-KYC పూర్తి చేయించుకోకపోతే, ఇప్పుడైనా చేయించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఇది చేసిన వారికే, రేషన్ బియ్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఈ-కేవైసీ ప్రక్రియ చేయించుకుంటే.. ఆ వ్యక్తి వివరాలు పక్కాగా ఉంటాయి. రేషన్ పొందేందుకు అర్హులో కాదో తేలిపోతుంది. అర్హులైన వారికి మాత్రమే రేషన్ ఇస్తారు. అందుకే కేంద్రం ఇది తప్పక పూర్తి చెయ్యాలి అంటోంది. ఏప్రిల్ 30 తర్వాత అంటే.. మే 1 నుంచి అర్హులైన వారికి మాత్రమే రేషన్ సరుకులు అందనున్నాయి. అందువల్ల అనర్హులను లబ్దిదారుల జాబితా నుంచి తొలగిస్తారు. ఈ ఈ-కేవైసీ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.

 

ఇది కూడా చదవండి: రూపే క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాక్ ! మే 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!

 

కొంతమంది తాము అర్హులమే అంటున్నారు, కానీ ఈ-కేవైసీ చేయించుకునే వీలు తమకు లేదని అంటున్నారు. ఇలాంటి వాటిని మే నుంచి కేంద్రం అంగీకరించదు. ఎట్టిపరిస్థితుల్లో ఈ-కేవైసీ పూర్తి చేయించుకోవాల్సిందే అని అధికారులు చెబుతున్నారు. నిజానికి కేంద్రం ఇలా గడువు పొడిగించడం అనేది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. తద్వారా వారు తమ రేషన్ కార్డు రద్దు అవ్వకుండా.. చేసుకునే వీలు లభించినట్లే. మీరు ఈ-కేవైసీ చేయించుకోవడం చాలా తేలిక. మీ రేషన్ కార్డును తీసుకొని.. రేషన్ డీలర్ దగ్గరకు వెళ్తే.. వారే ఈ పని చేస్తారు. లేదా.. ఆధార్ కేంద్రాల దగ్గరకు కూడా వెళ్లి చేయించుకోవచ్చు. జస్ట్ 10 నిమిషాల్లో ఈ పని పూర్తవుతుంది. కేంద్రం దగ్గర భారీగా బియ్యం, గోధుమల నిల్వలున్నాయి. అవి వచ్చే 3 ఏళ్ల వరకూ సరిపోతాయి. అందుకే వాటిని రేషన్ ద్వారా ఎప్పటికప్పుడు కేంద్రం పేదలకు ఇస్తోంది. వాటిని పేదలు తప్పక పొందాలి. నిజమైన పేదలే పొందేలా ఈ కేవైసీ.. రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తోంది. ఇఖ తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు త్వరలో ఇవ్వనుంది.

 

ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం నుంచి మరో బహుమతి! ఆ 11 నగరాల్లో! భారీ ప్రాజెక్ట్‌కు ఆమోదం!

 

ప్రస్తుతం దరఖాస్తులు తీసుకుంటోంది. గడువు పూర్తయ్యాక అధికారులు విచారణ చేపట్టి అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇస్తారు. పేదరిక రేఖకు కింద (బీపీఎల్) ఉండే కుటుంబాలకు త్రివర్ణ (మూడు రంగుల) కార్డులు, పేదరిక రేఖకు పైన (ఏపీఎల్) కుటుంబాలకు ఆకుపచ్చ రంగు కార్డులు ఇవ్వనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అలాగే, రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా, లబ్ధిదారుల జాబితాలో పేరు ఉంటే ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యం పొందవచ్చని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌‌లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఊపందుకుంది. మే నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ కార్డుల్లో QR కోడ్ ఉంటుందనీ, గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ఇదంతా సక్రమంగా జరగాలంటే.. ఆల్రెడీ రేషన్ పొందుతున్న వారు ఈ-కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కీలక దశకు పాస్టర్ ప్రవీణ్ మృతి.. మాజీ ఎంపీపై కేసు న‌మోదు! వైసీపీ గుండెల్లో గుబులు..

 

సెల్ఫీ వీడియోతో కలకలం! ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యాయత్నం!

 

ఆ రూట్ ని మోడరన్ రహదారిగా.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! నాలుగు లైన్ల రహదారి రూపంలో..!

 

ఏపీలో మెడిసిన్ మేకింగ్ హబ్.. భారీ పెట్టుబడులతో మెగా ప్రాజెక్ట్! 7,500 మందికి ఉపాధి కల్పన!

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

ఏపీకి మరో భారీ పెట్టుబడి వచ్చింది.. రూ.5వేల కోట్లతో - ఆ జిల్లాకు మహర్దశ! ప్రత్యక్షంగా, పరోక్షంగా 7,500 మందికి..

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

వైసీపీ ఎంపీ అరెస్ట్.. ప్యాలెస్ షేక్! లిక్కర్ స్కాంలో హైకోర్టు కీలక నిర్ణయం..!

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations